అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది: నారా భువనేశ్వరి

  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన భువనేశ్వరి
  • మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం
  • చిన కన్నయ్య కుటుంబాన్ని కలిసినప్పటి వీడియో పంచుకున్న భువనేశ్వరి 
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఏపీలో నిజం గెలవాలి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి, వారికి ఆర్థికసాయం అందించారు. తన పర్యటనలో భాగంగా... పోలవరంలో చండ్ర చిన కన్నయ్య కుటుంబాన్ని కూడా ఆమె పరామర్శించారు. 

ఈ నేపథ్యంలో, ఆమె తన పర్యటన తాలూకు ఘట్టాన్ని ఓ వీడియో రూపంలో నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"న్యాయం కోసం పోరాడే క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తుంది, స్ఫూర్తిగా నిలుస్తుంది. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు ఆయన జీవితం దిక్సూచి వంటిది. ఇటీవల నేను పోలవరంలో చండ్ర చిన కన్నయ్య కుటుంబాన్ని కలిశాను. చంద్రబాబు అరెస్ట్ తో తీవ్ర మనస్తాపానికి గురై చిన కన్నయ్య ప్రాణాలు విడిచారు. ఇప్పుడు నేను పంచుకున్న వీడియోలో వారి కుటుంబ గాథ ఉంటుంది" అని నారా భువనేశ్వరి వివరించారు.


More Telugu News