ఇంతవరకూ ఎవరూ ఈ పాయింటును టచ్ చేయలేదు: వరలక్ష్మి శరత్ కుమార్

ఇంతవరకూ ఎవరూ ఈ పాయింటును టచ్ చేయలేదు: వరలక్ష్మి శరత్ కుమార్
  • వరలక్ష్మి ప్రధాన పాత్రగా 'శబరి'
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • మే 3వ తేదీన విడుదల కానున్న సినిమా 
  • కొత్త పాయింట్ థ్రిల్ చేస్తుందన్న వరలక్ష్మి

వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఆమె సినిమాలకి మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రధానమైన పాత్రగా ఒక సినిమా రూపొందింది .. ఆ సినిమా పేరే 'శబరి'. మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి, అనిల్ దర్శకత్వం వహించాడు. మే 3వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ .. "కథ .. పాత్ర నచ్చితే నేను ఒప్పుకుంటాను .. అంతకు మించి మిగతా అంశాలను గురించి మాట్లాడను. నాకు చెప్పినట్టుగానే నా పాత్ర వెళుతుందా లేదా అనేది చూసుకుంటాను. షూటింగు సమయంలో డౌట్ వస్తే వెంటనే అడుగుతాను. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు" అని అన్నారు. 

" ఇంతవరకూ నేను ఏ పాత్రను తొందరపడి ఒప్పుకోలేదు .. ఒప్పుకున్న తరువాత బాధపడలేదు. 'శబరి' సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉంది. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ అది. అందువలన ప్రేక్షకులు ఆ కొత్తదనాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. ఎక్కడా బోర్ కొట్టకుండా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా ఈ కథ నడుస్తుంది" అని చెప్పారు.


More Telugu News