తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
- తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో 100 డేస్ పూర్తి చేసుకున్న హనుమాన్ మూవీ
- ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చిత్రం యూనిట్
- వారితో కొద్దిసేపు ముచ్చటించి.. సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్న గవర్నర్
- మైథలాజికల్ సూపర్ హీరో హనుమాన్ పాత్రను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిపై ప్రశంసలు
ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విజయవంతంగా 100 రోజుల స్క్రీనింగ్ కూడా పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో 100 డేస్ పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా హనుమాన్ హీరో, డైరెక్టర్ తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వారితో కొద్దిసేపు ముచ్చటించి.. సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు.
మైథలాజికల్ సూపర్ హీరో హనుమాన్ పాత్రను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపించారు గవర్నర్. ఈ సందర్భంగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ గవర్నర్‌కు హనుమాన్ ప్రతిమను బహూకరించారు. ఇక హనుమాన్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ 5 (తెలుగు) లో, జియో సినిమా (హిందీ) లలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ ఆదివారం ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్‌లో కూడా ప్రసారం కానుంది.