ఏడు లక్షల మెజార్టీతో గెలుస్తున్నా.. మథుర బీజేపీ లోక్‌సభ అభ్యర్థి హేమమాలిని ధీమా

  • కార్యకర్తలు బాగా పనిచేశారని కితాబునిచ్చిన హేమ మాలిని
  • నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానన్న బీజేపీ నాయకురాలు
  • యూపీలో ఆర్ఎల్డీతో పొత్తు మరిన్ని ఓట్లను సంపాదించి పెడుతుందన్న హేమ మాలిని
ఉత్తరప్రదేశ్‌లోని మథుర నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు హేమ మాలిని హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్నారు. ఈసారి తాను 5 నుంచి 7 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ‘ఆజ్‌తక్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు రెండో విడతలో భాగంగా పోలింగ్ జరుగుతోంది. ఇందులో ఆమె బరిలో ఉన్న మథుర కూడా ఉంది. 

మథురకు తాను ఎంతో సేవ చేశానని, కాబట్టి ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు బాగా పనిచేశారని, విజయంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు మిమ్మల్ని గెలిపిస్తాయా? లేదంటే, ‘మోదీ-యోగి ఫ్యాక్టర్’ పనిచేస్తుందా? అన్న ప్రశ్నకు ‘అన్నీ’ అని సమాధానం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో పొత్తు మరిన్ని ఓట్లను సంపాదించి పెడుతుందని తెలిపారు. కాగా, మథురలో హేమమాలినిని కాంగ్రెస్ నేత ముకేశ్ దంగర్ ఎదుర్కొంటున్నారు.


More Telugu News