బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల అమ్మకం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

  • బెంగళూరు, హైదరాబాద్ యువకుల మధ్య వాట్సాప్‌లో కుదిరిన స్నేహం
  • ఐపీఎల్‌ మ్యాచ్‌లకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునే యత్నం
  • ఇతరుల ఐడీలతో టికెట్ల కొనుగోలు.. ఆపై బ్లాక్‌లో విక్రయం
  • వంద టికెట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం
ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ సహా మరొకరిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 టికెట్లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన చిత్తూరు రమణ, హైదరాబాద్‌కు చెందిన శామ్యూల్ సుశీల్‌కు వాట్సాప్ ద్వారా స్నేహం కుదిరింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించిన వీరిద్దరూ ఆన్‌లైన్ ద్వారా ఇతరుల ఐడీలతో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. 

ఆ తర్వాత వాటిని బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. వీరి బ్లాక్ మార్కెట్ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ఉదయం వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


More Telugu News