బాబూమోహన్ నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ తరపున కాదా?.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి
- తాను ప్రజాశాంతి పార్టీలో లేనని బాబూమోహన్ స్పష్టీకరణ
- ఆ రోజు పాల్ కాఫీ తాగేందుకు రమ్మంటే వెళ్లానన్న మాజీ మంత్రి
- కండువా కప్పి పార్టీ అధ్యక్షుడిని చేశారని వివరణ
- అయినప్పటికీ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని వ్యాఖ్య
- ఇండిపెండెంట్ గా వరంగల్ నుంచి బరిలోకి దిగుతున్నట్టు చెప్పిన నేత
ప్రముఖ సినీ నటుడు, మాజీమంత్రి బాబూమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిని కానని, తాను ఆ పార్టీలో లేనని తెగేసి చెప్పారు. నిన్న వరంగల్ నుంచి లోక్‌సభ స్థానానికి ఆయన నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ తరపున ఆయన నామినేషన్ వేసినట్టు ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ తాను ప్రజాశాంతి పార్టీలోనే చేరలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనను కాఫీకి రమ్మంటే వెళ్లానని, అక్కడ ఆయన తనకు పార్టీ కండువా కప్పి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ తాను పార్టీ సభ్యత్వం తీసుకోలేదని తెలిపారు. తాను ఆ రోజే పార్టీకి గుడ్‌బై చెప్పేసినట్టు వివరించారు. వరంగల్‌లోని తన అభిమానుల కోరిక మేరకు ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగుతున్నట్టు చెప్పారు.