విశాఖలో నందమూరి బాలయ్య తనయ తేజస్విని ఇంటింటి ప్రచారం
- ఎన్డీయే, టీడీపీ లోక్‌సభ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకి మద్దతుగా ప్రచారం
- సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించిన తేజస్విని
- ప్రజల మద్దతు చూస్తుంటే గెలుపు తథ్యమని ధీమా
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలయ్య కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం రంగంలోకి దూకారు. ఎన్డీయే కూటమి, తెలుగుదేశం పార్టీ లోక్‌సభ అభ్యర్థి శ్రీభరత్ భార్య అయిన ఆమె భర్త కోసం విశాఖలో ప్రచారం నిర్వహించారు. నిన్న సాయంత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 33వ వార్డు పరిధిలోని నీలమ్మ తల్లి వేపచెట్టు ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పూలమాల వేసి పూజలు చేశారు.
అనంతరం అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. తన భర్త శ్రీభరత్‌కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 33 వార్డులో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకి మద్దతుగా ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. ఇక్కడి ప్రజల స్పందన చూస్తుంటే ఇద్దరూ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.