ఉపరాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

  • నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రానున్న ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్
  • ఐటీ కారిడార్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు
  • జూబ్లీహిల్స్, మియాపూర్ వైపునుంచి వచ్చే వాహనాలను దుర్గం చెరువు, సైబర్ టవర్స్ మీదుగా దారి మళ్లింపు
నేడు హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి రానున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు.. మాదాపూర్ పోలీస్ స్టేషన్, సీఓడీ జంక్షన్, దుర్గం చెరువు, ఐల్యాబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ మీదుగా బయోడైవర్సిటీకి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. 

మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్, ఖానామెట్ నుంచి వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్, ఏఐజీ హాస్పిటల్ , ఐకియా, దుర్గం చెరువు మీదుగా హైటెక్స్, సైబర్ టవర్స్ వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ ఏరియాల్లోకి భారీ వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.


More Telugu News