సన్ రైజర్స్ టార్గెట్ 207 రన్స్...56 పరుగులకే 4 వికెట్లు డౌన్

  • హైదరాబాదులో సన్ రైజర్స్ × ఆర్సీబీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు
  • రాణించిన కోహ్లీ, పాటిదార్, గ్రీన్
సొంతగడ్డ హైదరాబాదులో ఇవాళ సన్ రైజర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51, కెప్టెన్ డుప్లెసిస్ 25, రజత్ పాటిదార్ 50, కామెరాన్ గ్రీన్ 37 పరుగులు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కట్ 3, టి.నటరాజన్ 2, కెప్టెన్ కమిన్స్ 1, మార్కండే 1 వికెట్ తీశారు.

అనంతరం 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ట్రావిస్ హెడ్ తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం 1 పరుగు చేసిన హెడ్... పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు. 

మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ 13 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అభిషేక్ 3 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. పేసర్ యశ్ దయాళ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత కాసేపటికే ఐడెన్ మార్ క్రమ్ (7) కూడా వెనుదిరగడంతో సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. క్లాసెన్ వచ్చీ రావడంతోనే ఓ సిక్స్ బాదాడు. మరో సిక్స్ కొట్టే యత్నంలో అవుటయ్యాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 5 ఓవర్లలో 4 వికెట్లకు 56 పరుగులు.


More Telugu News