నాకు భయపడి నా పార్టీ గుర్తు మార్చేసి కుండ గుర్తు ఇచ్చారు: కేఏ పాల్
- విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేఏ పాల్
- తనను ఓడించే దమ్ము ఎవరికీ లేదని వెల్లడి
- దేశాన్ని బాగు చేయాలనుకునే పార్టీలు తనతో పొత్తు పెట్టుకోవాలని పిలుపు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనకు భయపడి తన పార్టీ గుర్తు మార్చేసి, తనకు కుండ గుర్తు కేటాయించారని ఆరోపించారు. విశాఖపట్నం ఓటర్లు తనవైపే ఉన్నారని, వారు తననే కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. విశాఖ ఎంపీ స్థానం బరిలో తనను ఓడించే దమ్ము ఎవరికీ లేదని, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి భరత్ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కేఏ పాల్ వెల్లడించారు.
దేశాన్ని బాగు చేయాలనుకునే పార్టీలు తనతో పొత్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని పాల్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించకుండా తాను హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చానని వెల్లడించారు. అయితే, స్టీల్ ప్లాంట్ భూములను ఇప్పటికే అమ్మేశారని కేఏ పాల్ మండిపడ్డారు.