మణిపూర్ ఘర్షణలపై అమెరికా నివేదికకు విలువలేదు: భారత్
- గతేడాది మణిపూర్ లో జాతుల మధ్య ఘర్షణలు
- నివేదిక రూపొందించిన అమెరికా
- తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపణ
- ప్రధాని మోదీ కూడా సిగ్గుచేటు అని పేర్కొన్నారని వెల్లడి
- ఆ నివేదిక పక్షపాత ధోరణితో రూపొందించారన్న భారత్
గతేడాది వేసవిలో మణిపూర్ లోని మెయిటీ ప్రజలకు, కొండజాతి కుకీ-జో తెగ ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 220 మందికి పైగా మరణించారు.
అయితే, ఈ జాతుల మధ్య ఘర్షణల అనంతరం తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని అగ్రరాజ్యం అమెరికా తన నివేదికలో పేర్కొంది. ఆ ఘటనలు సిగ్గుచేటు అని భారత్ ప్రధాని మోదీ పేర్కొన్నారని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారని కూడా అమెరికా తన నివేదికలో వివరించింది.
అంతేకాదు, బీబీసీ వార్తాసంస్థపై ఐటీ దాడులు, సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడం వంటి అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ఈ నివేదికను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ విడుదల చేశారు.
ఈ నివేదికపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అమెరికా నివేదికకు ఎలాంటి విలువ లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ నివేదిక పూర్తిగా పక్షపాత ధోరణితో రూపొదించారని ఆరోపించారు. భారత్ ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో దీన్నిబట్టి అర్థమవుతోందని అన్నారు.