నరేంద్ర మోదీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్
- మోదీ పాలనలో... వికసిత భారత్ కాదు... విభజిత భారత్ అన్న రేవంత్
- మోదీ పాలనలో... ఆర్థిక భారత్ కాదు... ఆకలి భారత్ అంటూ విమర్శ
- మోదీ పాలనలో... కొలువుల భారత్ కాదు... నిరుద్యోగ విలపిత భారత్ అని ఎద్దేవా
- పదేళ్ల మోదీ పాలనలో... వందేళ్ల విధ్వంసమంటూ రేవంత్ రెడ్డి ట్వీట్
పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో వందేళ్ల విధ్వంసమంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉదయం గాంధీ భవన్ వేదికగా 'నయవంచన - పదేండ్ల మోసం... వందేండ్ల విధ్వంసం' పేరుతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ప్రజా చార్జిషీట్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను రేవంత్ రెడ్డి సాయంత్రం ఎక్స్ వేదికగా పంచుకుంటూ బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
'మోదీ పాలనలో... వికసిత భారత్ కాదు... విభజిత భారత్,
మోదీ పాలనలో... ఆర్థిక భారత్ కాదు... ఆకలి భారత్,
మోదీ పాలనలో... కొలువుల భారత్ కాదు... నిరుద్యోగ విలపిత భారత్,
పదేళ్ల మోదీ పాలనలో... వందేళ్ల విధ్వంసం' అంటూ ట్వీట్ చేశారు.