టాస్ గెలిచి సన్ రైజర్స్ కు బ్యాటింగ్ ఇచ్చేందుకు వెనుకంజ వేసిన ఆర్సీబీ
- హైదరాబాదులో ఇవాళ సన్ రైజర్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు
- సొంతగడ్డపై విజయం కోసం ఉరకలేస్తున్న సన్ రైజర్స్
ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు ప్రతి మ్యాచ్ లో వారి స్కోరు 250కి పైనే నమోదవుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మొదలుకుని, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, మార్ క్రమ్, అబ్దుల్ సమద్ వరకు అందరూ హార్డ్ హిట్టర్లే. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ బాదేస్తున్నారు. బౌలర్ ఎవరన్నది లెక్కలేదు. బంతిని ఉతికారేయడమే లక్ష్యం!
ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టయినా టాస్ గెలిస్తే సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్ అప్పగిస్తుందా? ఇవ్వనే ఇవ్వదు. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా అదే చేసింది.
నేడు హైదరాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోరు సాధించి సన్ రైజర్స్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తామని ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ సందర్భంగా చెప్పాడు.
కాగా, ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ జట్టులో ఒక మార్పు జరిగింది. ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్ (ఇంపాక్ట్ ప్లేయర్), అభిషేక్ శర్మ, ఐడెన్ మార్ క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, మయాంక్ మార్కండే, టి.నటరాజన్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, మణిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గుసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాళ్.