సీఎం జగన్ నుదుటిపై గాయానికి ఓ డాక్టర్ గా నేనిచ్చే సలహా ఇదే!: సునీత

  • ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి
  • అప్పటి నుంచి బ్యాండ్ ఎయిడ్ తో కనిపిస్తున్న జగన్
  • గాయానికి గాలి తగిలితే త్వరగా మానిపోతుందన్న డాక్టర్ సునీత
  • లేకపోతే చీము పట్టి సెప్టిక్ అవుతుందని వెల్లడి
సీఎం జగన్ కు ఏప్రిల్ 13న విజయవాడలో రాయి దాడి కారణంగా నుదుటిపై గాయం కావడం తెలిసిందే. ఆయన ఇప్పటికీ నుదుటిపై బ్యాండేజితోనే దర్శనమిస్తున్నారు. దీనిపై ఇవాళ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం పట్ల తాను బాధపడుతున్నానని అన్నారు. 

"ఓ డాక్టర్ గా ఆయనకు ఒక సలహా ఇస్తున్నాను. అలా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా... అలా బ్యాండ్ ఎయిడ్లు, కట్లు కట్టుకోవద్దు. బ్యాండ్ ఎయిడ్లు, కట్లు కడితే లోపల చీము పట్టి సెప్టిక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్లీజ్... కొంచెం బ్యాండ్ ఎయిడ్ తీసేయండి... తద్వారా గాయానికి గాలి తగిలి ఎండిపోతుంది. త్వరగా మానిపోతుంది. 

ముఖ్యమంత్రి గారికి డాక్టర్లు ఎవరున్నారో నాకు తెలియదు కానీ, ఓ డాక్టర్ గా ఆయనను అలా చూడడం నాకు బాధేస్తోంది. గాయానికి అలా బ్యాండ్ ఎయిడ్ లు వేయడం అనేది మంచి సలహా కాదు" అని వివరించారు.


More Telugu News