వరంగల్ లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన బాబు మోహన్
- స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాబు మోహన్
- రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాల సమర్పణ
- బాబు మోహన్ కారును లోనికి అనుమతించని పోలీసులు
మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ వరంగల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నామినేషన్ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఆయన వరంగల్ కేంద్రంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నామినేషన్ దాఖలు చేసే సమయంలో బాబూ మోహన్ కారును లోపలికి అనుమతించలేదు. నామినేషన్ అనంతరం బాబు మోహన్ మాట్లాడుతూ... తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని... కానీ ఎన్నడూ ఇలాంటి వింత నిబంధనలు చూడలేదన్నారు. ఆయన వీల్ చైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాగా, బాబు మోహన్ గత నెలలో బీజేపీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు.