రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి
- పదేళ్ల ఎన్డీయే పాలనపై గాంధీభవన్ లో చార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్
- కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందన్న రేవంత్
- కార్పొరేట్ శక్తులకు మోదీ సర్కార్ లొంగి పనిచేస్తుందన్న రేవంత్ రెడ్డి
దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల రద్దుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పై దుష్ర్పచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనపై గురువారం గాంధీభవన్ లో చార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...మోదీ సర్కార్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి పనిచేస్తుందన్నారు. గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్ల అప్పులు చేస్తే ప్రధాని మోదీ మాత్రం రూ.113 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలు పరిచిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డబుల్ ఇంజిన్ పేరిట దేశాన్ని బీజేపీ దోచుకుంటుందన్నారు. 60 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ రంగ ఆస్తులను కేవలం 6 లక్షల కోట్ల రూపాయలకు కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ తెగనమ్మిందని రేవంత్ విమర్శించారు. చార్జ్ షీట్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటుగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.