బిడ్డను కంటే దంపతులకు నెలకు 64 వేల చొప్పున 8 ఏళ్ల పాటు ఇస్తామంటున్న దక్షిణ కొరియా
- మొత్తం రూ.61 లక్షలు అందించనున్నట్లు వెల్లడి
- దేశంలో జననాల రేటు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం
- త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం
పిల్లలు పుడితే ఖర్చు పెరుగుతుందని, నాలుగు రాళ్లు వెనకేసుకున్నాకే తల్లిదండ్రులుగా మారాలని ఆలోచించే దంపతులకు దక్షిణ కొరియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిల్లలను కంటే నెల నెలా ఆర్థిక సాయం ఇస్తామని చెబుతోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ పథకం సౌత్ కొరియాలో అమలవుతోంది. అయితే, ఇప్పుడు అందిస్తున్న ప్రోత్సాహక నగదు మొత్తాన్ని భారీగా పెంచాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోందట. దేశంలో ప్రమాదకర రీతిలో తగ్గిన జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా దక్షిణ కొరియా జనాభా తగ్గుతూ వస్తోంది. దేశంలో జీవన వ్యయం పెరగడం, జీవన నాణ్యత తగ్గడంతో చాలామంది దంపతులు పిల్లలను కనేందుకు ఇష్టపడడంలేదు. ఫలితంగా దేశంలో జననాల రేటు పడిపోయింది. దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ఠంగా 2023లో జననాల రేటు 0.72కు తగ్గిపోయింది.
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లల్నికనే దంపతులకు ఒక్కో బిడ్డకు రూ.64 వేల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇలా ఎనిమిదేళ్ల పాటు ఇస్తామని చెప్పారు. దీంతో ఒక బిడ్డను కన్న దంపతులకు అందే మొత్తం (ఎనిమిదేళ్లలో) రూ.61 లక్షలు. ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తం అక్కడి ప్రభుత్వ బడ్జెట్ లో దాదాపు సగం కావడం గమనార్హం. కాగా, బిడ్డలను కనిపెంచే తల్లిదండ్రులకు ఇస్తున్న ప్రోత్సాహక నగదు మొత్తం పెంచడంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.