తోడబుట్టిన చెల్లెలు పుట్టుక పైన కూడా..: జగన్ పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

తోడబుట్టిన చెల్లెలు పుట్టుక పైన కూడా..: జగన్ పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
  • పసుపు చీర కట్టుకుందని షర్మిలపై జగన్ విమర్శలు
  • ఇంటి ఆడబిడ్డ చీరపై కూడా విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపాటు
  • వికృత మనస్తత్వం అంటే ఇది కాదా? అని ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపై కూడా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపై కూడా విమర్శలు చేస్తున్నారని... ఇలాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రా? అని దుయ్యబట్టారు. ఇది చాలా నీచమని అన్నారు. వికృత మనస్తత్వం అంటే ఇది కాదా? అని ప్రశ్నించారు. 

పులివెందులలో ఈరోజు జగన్ మాట్లాడుతూ షర్మిల, సునీతలపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ ఉనికి లేకుండా చేయాలనుకుంటున్న వారితో చేతులు కలిపిన వీళ్లా వైఎస్ వారసులు అని ప్రశ్నించారు. టీడీపీ కుట్రలో భాగస్వాములవుతున్న వీళ్లా వైఎస్ వారసులు అని మండిపడ్డారు. పసుపు చీర కట్టుకుని... వారి ఇళ్లకు వెళ్లి, వారి స్క్రిప్టు మేరకు పని చేసే వీళ్లా  వైఎస్ వారసులు అని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 



More Telugu News