ఐపీఎల్‌లో మోహిత్ చెత్త ప్రదర్శన.. థంపి రికార్డు బద్దలు
- ఢిల్లీతో మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మోహిత్
- ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా నాలుగు ఓవర్లలో 73 పరుగులు
- 2018 నాటి ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు థంపి రికార్డు బద్దలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్‌శర్మ ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. నిన్న ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ నాలుగు ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును తనపై రాసుకున్నాడు.
మోహిత్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రిషభ్‌పంత్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. 2018లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బాసిల్ థంపి నాలుగు ఓవర్లు వేసి వికెట్ తీసుకోకుండా 70 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇప్పుడా రికార్డు బద్దలైంది.