బీహార్‌లో జేడీయూ నేత హత్య .. ఉద్రిక్తత
- పెళ్లికి హాజరై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులే టార్గెట్‌గా కాల్పులు
- రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు
- స్థానికులు నిరసన తెలపడంతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం
లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్‌లో జేడీయూకి చెందిన రాజకీయ నేత సౌరభ్ కుమార్ హత్యకు గురయ్యారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు అతనిని తుపాకీతో కాల్చి చంపారు. పాట్నాలోని పున్‌పున్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకకు హాజరయ్యి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పున్‌పున్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 24న అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగిందని, ఇద్దరు వ్యక్తులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారని, సౌరభ్ కుమార్ చనిపోయారని పోలీసులు తెలిపారు. సౌరభ్ స్నేహితుడు మున్మున్ తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు.
ఈ కాల్పుల ఘటనతో పున్‌పున్ ఏరియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో నిరసనలు తెలిపారు. రోడ్డుపై బైఠాయించడంతో 86వ నంబర్ జాతీయ రహదారిపై కొన్ని గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి తర్వాత నిరసనకారులను పోలీసులు శాంతింపజేశారు.
సౌరభ్ కుమార్‌కు 2 బుల్లెట్ గాయాలయ్యాయని, అతడి స్నేహితుడు మున్మున్ కుమార్‌కు బుల్లెట్లు తగిలాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.