చేవెళ్ల ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి సాహితి
- బుధవారం నామినేషన్ దాఖలు చేసిన వైనం
- ఇటీవల కాలంలో ఇన్‌స్టా వేదికగా రాజకీయాలపై స్పందిస్తున్న సాహితి
- తన రీల్స్ ఏ పార్టీనీ ఉద్దేశించినవి కావని స్పష్టీకరణ
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరో సినీనటి బరిలో నిలిచారు. ‘పొలిమేర’ సిరీస్ చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందిన నటి దాసరి సాహితి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
పొలిమేర, పొలిమేర-2 చిత్రాలతో సాహితి నటన సినీప్రేక్షకులను మెప్పించింది. తొలి భాగంలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె సీక్వెల్‌లో రాజేశ్‌తో కలిసి నటించారు. తను పవన్ కల్యాణ్ అభిమానినని చెప్పుకునే ఆమె ఇటీవల కాలంలో తన ఇన్‌స్టాలో రాజకీయాలపై కూడా స్పందించారు. అయితే, తన ఇన్‌స్టా రీల్స్‌కు రాజకీయాలు ఆపాదించొద్దని కూడా ఆమె కోరారు. ఇక చేవెళ్ల నుంచి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు.