ఇదంతా నా తల్లి చలవే: హీరో సుమన్
- యాక్షన్ హీరోగా మెప్పించిన సుమన్
- ఫ్యామిలీ హీరోగాను రాణించిన వైనం
- తన ఎదుగుదలకి తన తల్లి కారణమని వెల్లడి
- ఎంతో మంది స్టూడెంట్స్ ను తన తల్లి ప్రభావితం చేసిందని వ్యాఖ్య
యాక్షన్ హీరోగా సుమన్ ఒక వెలుగు వెలిగారు. ఆరంభంలో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన పాత్రలతో పలకరించిన సుమన్, ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 'అన్నమయ్య'లో వేంకటేశ్వరస్వామిగా .. 'శ్రీరామదాసు'లో శ్రీరాముడిగా ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ తరహా పాత్రలకి సైతం సుమన్ సరిగ్గా సరిపోతారని నిరూపించారు.
అలాంటి సుమన్ ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లికి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "మా అమ్మగారు చెన్నైలోని ఓ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా పనిచేసేవారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న చాలామంది మా అమ్మగారి దగ్గర చదువుకున్నవారే. ఎయిర్ పోర్టులో కలిసినప్పుడు వాళ్లు ఆ విషయాలు నాకు చెబుతూ ఉండటం వలన తెలిసింది" అని అన్నారు.
"మా అమ్మగారు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. నా ఎదుగుదల .. నేను సాధించిన విజయాల వెనుక మా అమ్మగారి హస్తం ఉంది. జీవితంలో పదవులు .. అవి తెచ్చిపెట్టే పేరు కంటే, వ్యక్తిత్వం పరంగా వచ్చిన పేరే శాశ్వతంగా ఉంటుందని ఆమె చెప్పేవారు. నన్ను మాత్రమే కాదు .. తన మాటలతో ఆమె చాలామంది స్టూడెంట్స్ ను ప్రభావితం చేశారనే విషయం నాకు అర్థమైంది. అలాంటి తల్లిని కోల్పోవడం ఎప్పటికీ తీరని లోటే" అని చెప్పారు.