పునర్విక... అంటూ ఓ పాపకు నామకరణం చేసిన చంద్రబాబు
- శ్రీకాకుళంలో మహిళలతో చంద్రబాబు భేటీ
- తమ బిడ్డను వేదికపైకి తీసుకువచ్చిన తల్లి, అమ్మమ్మ
- బిడ్డను చేతుల్లోకి తీసుకుని దీవించిన చంద్రబాబు
- పునర్విక అనేది కొత్త తరం పేరు అని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళంలో మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓ పాపకు నామకరణం చేశారు. ఆ పసికందు వయసు ఒక నెల. ఓ మహిళ తన మనవరాలైన ఆ చంటిపాపను వేదికపైకి తీసుకురాగా, చంద్రబాబు ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు.
ఆ పాప తల్లి, అమ్మమ్మ... చంద్రబాబును తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ... ఆ అమ్మాయి పేరు పునర్విక అని ప్రకటించారు. పునర్విక అనేది కొత్త పేరు అని చంద్రబాబు వెల్లడించారు.
"నేను పేరు పెడితే ఆ బిడ్డ భవిష్యత్ బాగుంటుందని ఆ పాప అమ్మమ్మ, తల్లి ఇక్కడికి వచ్చారు. ఈ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... పునర్విక అని నామకరణం చేస్తున్నాను. ఇది రాబోయే తరాలకు ఉపయోగపడే పేరు. అందరూ ఈ పాపను ఆశీర్వదించండి" అని పిలుపునిచ్చారు.
అంతేకాదు, తన చేతుల్లో ఉన్న పసిపాపను పునర్విక, పునర్విక అని పలకరించారు. "ఏయ్, నిద్ర లేచావా... నీ పేరు పునర్విక" అని మురిపెంగా చెప్పారు. ఆ బిడ్డను వాత్సల్యంతో ముద్దాడారు.