అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: జో బైడెన్
- ప్రపంచ నాయకత్వంపై డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తప్పుబట్టిన అమెరికా అధ్యక్షుడు
- ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయన్న బైడెన్
- యావత్ ప్రపంచం అమెరికావైపే చూస్తోందని వ్యాఖ్య
- నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న డొనాల్డ్ ట్రంప్, బైడెన్
- 2020లో ట్రంప్ చేతిలో ఓడిపోయిన రాష్ట్రాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జో బైడెన్
నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తలపడనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బైడెన్ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు.
"ట్రంప్ కోరుకున్నట్లే అమెరికా ప్రపంచ వేదికపై నుంచి తప్పుకుంటే ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో మాట్లాడిన జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫ్లోరిడాలోని టంపాలోని హిల్స్‌బరో కమ్యూనిటీ కాలేజీలో మంగళవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని చెప్పారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు మీరే గెలవాలని తనతో చెప్పారని పేర్కొన్నారు. యావత్ ప్రపంచం అమెరికావైపే చూస్తోందని అన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే, ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని బైడెన్ చెప్పుకొచ్చారు.
కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు బైడెన్ 2020లో తాను గెలిచిన రాష్ట్రాల్లోనే కాకుండా ట్రంప్ చేతిలో తాను ఓడిపోయిన రాష్ట్రాల్లో కూడా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. 2020లో ట్రంప్ ఫ్లోరిడాలో బైడెన్‌ను కేవలం 3.3 శాతం పాయింట్లతో ఓడించడం జరిగింది. ఇక ఇప్పటివరకు తమకు 500 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందాయని బైడెన్ తెలిపారు. వీటిని 16 లక్షల మంది దాతలు ఇచ్చినట్లు వెల్లడించారు. వీరిలో 97 శాతం మంది 200 డాలర్ల కంటే తక్కువ ఇచ్చారని బైడెన్ చెప్పారు.
పోల్స్ అన్నీ మా వైపే..
ఇక అనేక సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే తానే ముందున్నానని జో బైడెన్ తెలిపారు. "ఇప్పటివరకు వెలువడిన 23 జాతీయ స్థాయి పోల్స్‌లో పదింటిలో నేనే ముందున్నాను. డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదింటిలో ఆధిక్యంలో ఉన్నారు. ఐదింటిలో టై అయ్యింది. కచ్చితంగా పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి" అని బైడెన్ తన మద్దతుదారులకు వివరించడం జరిగింది.