నేను రాజీనామాకు సిద్ధం: రేవంత్ రెడ్డి సవాల్‌పై స్పందించిన హరీశ్ రావు
- ఇచ్చిన హామీలను అధికార పార్టీ అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్న హరీశ్ రావు
- శుక్రవారం అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని... రేవంత్ రెడ్డి కూడా రావాలని సూచన
- పంద్రాగస్ట్ లోగా రుణమాఫీని పూర్తిగా చేస్తానని ప్రమాణం చేయాలని డిమాండ్
- హామీని నిలబెట్టుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు
- ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ పోటీ చేయనని హామీ
- రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. తాను ముఖ్యమంత్రి సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. పంద్రాగస్ట్ లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని... అలా చేయకుంటే ఆయన రాజీనామా చేస్తారా? అని హరీశ్ రావు ఇటీవల సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై నిన్న ముఖ్యమంత్రి స్పందించారు. తాను ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నానని... రుణమాఫీ చేయకుంటే తాను రాజీనామా చేస్తానని... మరి హామీని అమలు చేస్తే హరీశ్ రావు పార్టీని మూసేసుకుంటారా? అని ప్రతి సవాల్ చేశారు. దీనిపై ఈరోజు హరీశ్ రావు తిరిగి స్పందించారు.
సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను అధికార పార్టీ చేత అమలు చేయించే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తానని... సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడకు వచ్చి... పంద్రాగస్ట్ లోగా రుణమాఫీని పూర్తిగా చేస్తానని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన హామీని నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు అన్నారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని హామీ ఇచ్చారు. మరి రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9లోగా అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని విమర్శించారు. పైగా ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే హామీలు నెరవేరిస్తే పార్టీని రద్దు చేసుకుంటారా? అని తొండి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు అయిందని... కానీ మీ గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500, రైతులకు రూ.15,000 రైతుబంధు, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.