ఇది సాహసం కాదు.. ప్రాణాలు పణంగా పెట్టే వికృత క్రీడ.. సజ్జనార్ వార్నింగ్
- మిట్ట మధ్యాహ్నం ఎండలో ఒకే బైక్‌పై ఏడుగురి ప్రయాణం
- వారిలో ఐదుగురు చిన్నారులే
- మండుటెండలో ఇంతమందా? అని సజ్జనార్ ఆశ్చర్యం
- చిన్నారుల విషయంలో తల్లిదండ్రుల ప్రవర్తన బాధాకరమన్న ఆర్టీసీ ఎండీ
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తరచూ పెట్టే పోస్టులు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఆయన పోస్టుల్లో కొన్ని హెచ్చరికలు, మరికొన్ని మందలింపులు కూడా ఉంటాయి. తాజాగా, ఆయన షేర్ చేసిన పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.
మండుటెండలో ఓ వ్యక్తి బైక్‌పై ఆరుగురిని (ఆయనతో కలిపి ఏడుగురు) ఎక్కించుకుని ప్రయాణిస్తున్నాడు. వారిలో ఐదుగురు చిన్నారులే. బైక్‌పై ముగ్గురు ప్రయాణించడమే నేరమైన వేళ ఏకంగా ఏడుగురితో ప్రయాణిస్తూ వార్తల్లోకి ఎక్కాడు. అనుకోని ప్రమాదం సంభవిస్తే వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఊహకే భయంకరంగా ఉందంటూ నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ చేస్తున్నారు.
ఈ క్లిప్‌ను షేర్ చేసిన సజ్జనార్.. మండుటెండలో ఒక్క బైక్‌పై ఇంతమందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఇలాంటి ప్రమాదకరమైన బైక్ ప్రయాణం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా ప్రవర్తించడం బాధాకరమని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.