రణ్‌వీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియో.. ‘ఎక్స్’ యూజర్‌పై కేసు
- బీజేపీకి వ్యతిరేకంగా రణ్‌వీర్ ప్రచారం చేస్తున్నట్టు డీప్‌ఫేక్ వీడియో వైరల్
- పోలీసులను ఆశ్రయించిన నటుడు
- ఓ ఎక్స్ యూజర్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియో కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు sujataindia1st అనే ఎక్స్ అకౌంట్ ఉన్న యూజర్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 417, 468, 469, 471, 66డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బీజేపీకి ఓటు వేయొద్దంటూ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న ఇటీవల ఓ డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై రణ్‌వీర్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. అంతేకాకుండా, ఏఐ డీప్ ఫేక్ వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను ఎక్స్ వేదికగా హెచ్చరించారు. మరో సినీనటుడు ఆమిర్ ఖాన్ కూడా డీఫ్ ఫేక్ వీడియో బాధితుడైన విషయం తెలిసిందే.