కేసీఆర్ ఇంటర్వ్యూపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్
- ఇంటర్వ్యూని మాస్టర్స్ క్లాస్ గా అభివర్ణించిన కేటీఆర్
- క్లాస్ అనేది పర్మినెంట్ అని వ్యాఖ్య
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ 9 వార్తా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 స్టూడియోకు వెళ్లిన ఆయన 4 గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలక అంశాలపై ఆయన తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 14 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలకు అక్కడే సమాధానం చెపుతానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని... తాను మళ్లీ సీఎం అవుతానని అన్నారు.
మరోవైపు, తన తండ్రి ఇంటర్వ్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఇంటర్య్యూని మాస్టర్స్ క్లాస్ గా అభివర్ణించారు. కేసీఆర్ చెప్పినట్టు ఫామ్ అనేది తాత్కాలికమని.... క్లాస్ అనేది పర్మినెంట్ అని చెప్పారు.