ఇది గమనించారా... బంగారం ధర తగ్గింది!

  • ఇటీవల పైపైకి పెరిగిన బంగారం ధరలు
  • అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్
  • భారత్ లో రూ.1000కి పైనే తగ్గిన ధర
  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,300
గత కొంతకాలంగా మార్కెట్ తీరును పరిశీలిస్తే బంగారం ధరలు పైపైకి పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి బంగారం ధర తగ్గింది. భారత్ లో రూ.1000కి పైనే తగ్గింది. 

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.74,300గా ఉంది. అంతర్జాతీయగా డిమాండ్ తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్లలోనూ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ప్రపంచ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర రూ.1.93 లక్షలు ఉండగా, ఒక్కరోజులోనే అది రూ.4,163 మేర తగ్గింది. 

అటు, వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. వెండి కిలో రూ.2 వేల తగ్గుదలతో ధర రూ.83,300 వద్ద ట్రేడవుతోంది.


More Telugu News