తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు
- సీఈవో వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి
- స్పీకర్‌గా ఉండి చేవెళ్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు
- కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారన్న బీజేపీ నేత
తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని సీఈవో వికాస్ రాజ్‌ను బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి కలిసి ఫిర్యాదు లేఖను అందించారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. స్పీకర్ ప్రచారం చేసిన ఆడియో, వీడియో రికార్డింగులను సీఈవో వికాస్ రాజ్‌కు అందించినట్లు బీజేపీ నేత... మీడియాకు తెలిపారు. లోక్ సభ కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.