దేశంలోనే తొలిసారిగా ఆల్ ఇన్ వన్ పేమెంట్ పరికరాన్ని తీసుకువచ్చిన భారత్ పే
- పీఓఎస్ తరహా పరికరాన్ని రూపొందించిన భారత్ పే
- ఒకే పరికరంలో పీఓఎస్ సేవలు, క్యూఆర్ కోడ్, టాప్ అండ్ పే చెల్లింపులు
- చెల్లింపు సందేశాలు వినిపించేందుకు ఇందులోనే స్పీకర్
- తొలుత దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ప్రవేశపెట్టనున్న భారత్ పే
దేశీయ ఫిన్ టెక్ కంపెనీ భారత్ పే దేశంలోనే తొలిసారిగా ఆల్ ఇన్ వన్ పేమెంట్ డివైస్ ను తీసుకువచ్చింది. ఒకే పరికరంలో పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్స్), క్యూఆర్ కోడ్ డిస్ ప్లే, టాప్ అండ్ ప్లే ప్యానెల్, స్పీకర్ పొందుపరిచారు.
సాధారణంగా దుకాణాల్లో, బ్యాంకుల్లో కనిపించే పీఓఎస్ పరికరాలలో క్యూఆర్ కోడ్ డిస్ ప్లే, స్పీకర్ ఉండవు. అందుకు భిన్నంగా భారత్ పే రూపొందించిన ఆల్ ఇన్ వన్ డివైస్ తో పీఓఎస్ సేవలతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారానూ, టాప్ అండ్ పే విధానంలోనూ డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపు జరిగినట్టు సందేశం వినిపించేందుకు ఇందులోనే స్పీకర్ కూడా ఉంటుంది.
ఈ పరికరానికి భారత్ పే వన్ గా నామకరణం చేశారు. తొలి దశలో ఈ పరికరాన్ని దేశంలోని 100 నగరాల్లో ప్రవేశపెట్టాలని భారత్ పే ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో 450 నగరాలకు విస్తరించనున్నారు.
ఈ ఆల్ ఆన్ వన్ డివైస్ ఇటు దుకాణాదారులకు, అటు వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, దీన్ని ఎంతో సులభమైన రీతిలో ఉపయోగించుకోవచ్చని భారత్ పే వెల్లడించింది. పైలట్ ప్రాజెక్టుగా కొందరు దుకాణదారులకు ఈ పరికరాలను అందించామని, వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేసింది.