తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలకు బుద్ధి చెప్పాలి: కేటీఆర్
- రాజేంద్రనగర్ లో కేటీఆర్ రోడ్ షో
- కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపు
- బీజేపీకి 200 సీట్లు కూడా రావని జోస్యం
లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని అని కొనియాడారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన రంజిత్ రెడ్డి (కాంగ్రెస్ అభ్యర్థి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (బీజేపీ)లకు బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు.
బీఆర్ఎస్ కు 8 నుంచి 10 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అయినా మన మాట వింటుందని కేటీఆర్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కాదు.. 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ కు 100 నుంచి 150 సీట్లు కూడా రావని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసే కాంగ్రెస్ పార్టీని అందరూ నిలదీయాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ గత పదేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. చేవెళ్ల లోక్ సభ పరిధిలోని రాజేంద్రనగర్ లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.