లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. భారీగా లాభపడ్డ టెలికాం సూచీ

  • 90 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4.27 శాతం పెరిగిన టెలికాం సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలతల కారణంగా మన మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 90 పాయింట్లు లాభపడి 73,738కి చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 22,368 వద్ద స్థిరపడింది. మెటల్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. టెలికాం సూచీ 4.27 శాతం, రియాల్టీ సూచీ 2.42 శాతం పెరిగాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.38%), నెస్లే ఇండియా (1.77%), మారుతి (1.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.42%), టాటా మోటార్స్ (1.34%). 

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-3.63%), రిలయన్స్ (-1.42%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.00%), టెక్ మహీంద్రా (-0.63%), బజాజ్ ఫైనాన్స్ (-0.58%).


More Telugu News