అన్ని మార్గాలుంటే ఇలా ఔట్ చేస్తారా?.. కోహ్లీకి హర్షిత్ రాణా క్షమాపణలు చెప్పి ఉండాల్సింది: కైఫ్

  • కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అవుట్‌పై వివాదం
  • బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు 60 మార్గాలున్నాయన్న కైఫ్
  • బీమర్‌ను ఎంచుకోవడం దారుణమని అభిప్రాయపడిన టీమిండియా మాజీ స్టార్
  • ఇలాంటి బంతిని ఆడేందుకు బ్యాటర్ సిద్ధంగా ఉండడన్న కైఫ్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ వివాదాస్పద ఔట్‌పై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ స్పందించాడు. హర్షిత్ రాణా వేసిన ఫుల్‌టాస్‌కు కోహ్లీ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఇది ఫుల్‌టాస్ అని కోహ్లీ వాదించగా, రీప్లేలో మాత్రం అది నడుము కంటే తక్కువ ఎత్తులోనే పిచ్ అవుతున్నట్టు తేలింది. అంపైర్‌తో కోహ్లీ వాదనకు దిగడం, ఆగ్రహంగా పెవిలియన్ చేరడం వంటివి కనిపించాయి. కోహ్లీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐపీఎల్ పాలకమండలి భారీ జరిమానా విధించింది.

తాజాగా ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. బీమర్ (బ్యాటర్ శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వేసిన బంతి) సంధించిన హర్షిత్ రాణా.. కోహ్లీకి క్షమాపణలు చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఒకేబంతితో బ్యాటర్‌ను 10 రకాలుగా ఔట్ చేయవచ్చని, ఈ రకంగా ఆరు బంతులతో బ్యాటర్‌ను అవుట్ చేసేందుకు 60 మార్గాలు ఉన్నాయని కైఫ్ పేర్కొన్నాడు. 

 "ఒకే బంతితో 10 రకాలుగా బ్యాటర్‌ని ఔట్ చేయవచ్చు మరియు ఆరు డెలివరీలతో బ్యాటర్‌ను అవుట్ చేయడానికి 60 మార్గాలు ఉన్నాయి. బ్యాటర్‌ను అవుట్ చేయడానికి కేవలం 10 మార్గాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీని బీమర్ అవుట్ చేశాడు. కొత్తదిది" అని కైఫ్ పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు కోహ్లీ బీమర్ కారణంగా అవుటయ్యాడని, ఇది కొత్త మార్గమంటూ కైఫ్ తన ఎక్స్ ఖాతాలో వీడియోను షేర్ చేశాడు. 

నిజానికి కోహ్లీని బీమర్‌తో ఔట్ చేయాలనేది భయంకరమైన నిర్ణయమని కైఫ్ పేర్కొన్నాడు. ఎందుకంటే అలా దూసుకొచ్చే బంతిని ఎలా నియంత్రించగలమని ప్రశ్నించాడు. ఇది ఎంతమాత్రమూ న్యాయమైంది కాదని అభిప్రాయపడ్డాడు. హర్షిత్ రాణా విసిరిన బంతి ఓ నిర్దిష్ట పథకంలో వచ్చింది కాబట్టి నోబాల్ ఇచ్చి ఉండాల్సిందని పేర్కొన్నాడు. తన చేతిలోంచి బంతి జారిపోయినందుకు కోహ్లీకి హర్షిత్ రాణా క్షమాపణలు చెప్పి ఉండాల్సిందని వివరించాడు. కోహ్లీని ఔట్‌గా ప్రకటించడం దారుణమైన నిర్ణయమని పేర్కొన్నాడు.  బ్యాటర్ ఎప్పుడూ బంతి ఎక్కడ పిచ్ అవుతుందనేదే చూస్తాడు తప్పితే ఇలాంటి బంతిని ఊహించడని, కోహ్లీని ఔట్‌గా ప్రకటించడం మంచి నిర్ణయం కాదని కైఫ్ స్పష్టం చేశాడు.


More Telugu News