టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో వీడియో.. గూస్‌బంప్స్ గ్యారెంటీ..!
- మరో 40 రోజుల్లో 2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం
- ఈ నేపథ్యంలో టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్
- వీడియోలో రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్, పాండ్యా, జడేజాలను చూపించిన వైనం
మరో 40 రోజుల్లో 2024 టీ20 వరల్డ్కప్ టోర్నీకి తెర లేవనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తాజాగా టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియోను విడుదల చేసింది. 'రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?' అనే క్యాప్షన్‌తో ఎక్స్ వేదికగా ఈ వీడియోను పంచుకుంది. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో భారత జాతీయ గేయం 'వందేమాతరం'ను ప్లే చేయడం జరిగింది. వీడియోలో భారత జట్టు కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను చూపించడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
ఇక ఈసారి టీ20 ప్రపంచకప్‌కు ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ జూన్ 2న ప్రారంభం కానుంది. టోర్నీలో మొత్తం 20 దేశాలు, ఐదు గ్రూపులుగా విడిపోయి బరిలోకి దిగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. ఇక టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన టీమిండియా, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది.
కాగా, భారత్ గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. టీమిండియా చివరిసారిగా 2013లో ధోనీ నేతృత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ (2015, 2019, 2023), టీ20 ప్రపంచకప్ (2014, 2016, 2021, 2022) టోర్నీలలో విఫలమైంది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లోనూ ఫైనల్ దాకా వెళ్లిన రోహిత్ సేన టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో ఈసారైనా టీమ్ఇండియా వరల్డ్‌కప్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంది.