అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీకి జరిమానా

  • కోల్ కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఘటన
  • ఫుల్ టాస్ బాల్ కు అవుటైన కోహ్లీ
  • అది నడుం ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందన్న కోహ్లీ
  • నిబంధనల ప్రకారం అది నాటౌట్ అంటూ అంపైర్ తో వాగ్యుద్ధం
  • కోహ్లీ నియమావళిని ఉల్లంఘించాడన్న ఐపీఎల్ పాలకమండలి
కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ చాలెంజర్స్ మ్యాచ్ సందర్భంగా అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ జరిమానాకు గురయ్యాడు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా కోహ్లీ ఓ ఫుల్ టాస్ బాల్ కు అవుటయ్యాడు. అయితే అది నడుం ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని, నిబంధనల ప్రకారం అది నోబాల్ అవుతుంది కాబట్టి, తాను నాటౌట్ అంటూ కోహ్లీ వాదించాడు. మైదానంలో ఉన్న అంపైర్లతో వాగ్యుద్ధం పెట్టుకున్నాడు. 

కోహ్లీ ప్రవర్తనను ఐపీఎల్ పాలకమండలి తీవ్రంగా పరిగణించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం కోహ్లీ లెవల్-1 తప్పిదానికి పాల్పడినట్టు పాలకమండలి గుర్తించింది. తాను నిబంధనలు అతిక్రమించినట్టు కోహ్లీ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ జరిమానాతో సరిపెట్టారు.


More Telugu News