నాకు పెళ్లి, పిల్లలు వద్దు: రాజ్ తరుణ్

నాకు పెళ్లి, పిల్లలు వద్దు: రాజ్ తరుణ్
  • పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యానన్న రాజ్ తరుణ్
  • సింగిల్ గా హ్యాపీగా ఉన్నానని వ్యాఖ్య
  • ఇంట్లో వాళ్లు కూడా నీ పెళ్లి నీ ఇష్టం అంటున్నారన్న రాజ్ తరుణ్
షార్ట్ ఫిల్మ్ ల నుంచి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరి ఊహించని విధంగా హీరో అయ్యాడు రాజ్ తరుణ్. తొలి సినిమా 'ఉయ్యాలా జంపాలా'తోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు పర్వాలేదనిపించినా... ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం పురుషోత్తముడు, భలే ఉన్నాడే, తిరగబడరా సామీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్యలో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యానని చెప్పాడు. తనకు పెళ్లి, పిల్లలు వద్దని తెలిపాడు. సింగిల్ గా తాను చాలా హ్యాపీగా ఉంటానని అన్నాడు. పెళ్లి విషయంలో తొలి నుంచి కూడా మా నాన్న నీ ఇష్టం అనేవారని... అమ్మ మాత్రం పెళ్లి చేసుకో అని చెప్పేదని, ఇప్పుడు నీ పెళ్లి నీ ఇష్టం అని వదిలేసిందని చెప్పాడు. పెళ్లి గురించి ఇప్పట్లో తమ ఇంట్లో ఎలాంటి ఆలోచన లేదని తెలిపాడు. రాజ్ తరుణ్ వయసు ఇంకా 31 ఏళ్లు మాత్రమే. రానున్న రోజుల్లో తన పెళ్లిపై నిర్ణయం మార్చుకుంటాడేమో వేచి చూడాలి.


More Telugu News