భారీ లాభాల దిశగా దూసుకుపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్'
- మలయాళంలో హిట్ కొట్టిన 'మంజుమ్మల్ బాయ్స్'
- వసూళ్ల విషయంలో కొత్త రికార్డు
- తెలుగులో మూడో వారంలోకి అడుగుపెట్టిన సినిమా
- ఇక్కడ కూడా లాభాల బాటపట్టిన వైనం
మలయాళంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. 'భ్రమయుగం' .. 'ప్రేమలు' .. 'మంజుమ్మల్ బోయ్స్' ఆ జాబితాలో కనిపిస్తాయి. తెలుగు విషయానికి వచ్చేసరికి, 'భ్రమయుగం' ఒక వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక 'ప్రేమలు' సినిమా ఇక్కడ మంచి లాభాలను రాబట్టుకుంది. ఆ తరువాత ఇక్కడి ప్రేక్షకులను 'మంజుమ్మల్ బాయ్స్' పలకరించింది.
నిజానికి ఈ సినిమాకి 'ప్రేమలు' మాదిరిగానే ఇక్కడ పెద్దగా పబ్లిసిటీ లేదు. అయినా 'మంజుమ్మల్ బాయ్స్' కి ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా ఇక్కడ మూడో వారంలోకి అడుగుపెట్టింది. నిజానికి ఈ సినిమాలో ఆర్టిస్టులు ఇక్కడి వారికి పెద్దగా తెలియదు. ఓటీటీ సినిమాలను ఫాలో అయ్యేవారికి మాత్రం వీరు ముఖపరిచయం ఉన్నవారే. కథలోకి ఎంటరైన తరువాత కళ్లు స్టార్స్ గురించి వెతకడం మానేస్తాయి.
అలాంటి ఈ సినిమా తెలుగులో భారీ వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం. కేవలం 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 250 కోట్ల మార్కును టచ్ చేయడం నిజంగా ఒక విశేషమే. హీరోయిజం .. హీరోయిన్ .. కామెడీ లేకపోయినా, కేవలం కంటెంట్ తోనే ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతుండటం నిజంగా విశేషమే.