ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఫలితాల్లో బాలికలదే పైచేయి!
- ఉత్తీర్ణులైన 86.69 శాతం మంది విద్యార్థులు
- బాలుర ఉత్తీర్ణత: 84.32 శాతం
- బాలికల ఉత్తీర్ణత: 89.17 శాతం
- పరీక్షలకు 6.23 లక్షల మంది విద్యార్థుల హాజరు
- మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగిన పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,743 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32గా నమోదు కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా నమోదైంది.