చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్‌లో తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత!
- ఒక జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా కోహ్లీ
- ఆర్‌సీబీ తరఫున ఇప్పటివరకు 250 సిక్సులు బాదిన విరాట్
- ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (ఆర్‌సీబీ) 239, ఏబీ డివిలియర్స్ (ఆర్‌సీబీ) 238, రోహిత్ శర్మ (ఎంఐ) 224
ఐపీఎల్‌లో ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో రెండు సిక్సర్లు బాదిన రన్‌మెషిన్.. ఒక జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2008 నుంచి ఆర్‌సీబీకి ఆడుతున్న ఇప్పటివరకు 250 సిక్సులు కొట్టాడు.
ఇక అతని తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (ఆర్‌సీబీ) 239, ఏబీ డివిలియర్స్ (ఆర్‌సీబీ) 238, రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) 224, కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) 223 ఉన్నారు. అలాగే కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదైంది. 250 సిక్సులు కొట్టిన నాలుగో బ్యాటర్‌గా, రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
కాగా, ఐపీఎల్‌లో ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్ల రికార్డు మాత్రం యూనివర్సల్ బాస్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తంగా 357 సిక్సర్లు బాదాడు. అతని తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (275), ఏబీ డివిలియర్స్ (251) ఉన్నారు.