2023-24 ఏడాదికి టీటీడీ ఆదాయం ఎంతో తెలుసా...?

  • రూ.1,161 కోట్ల నగదు, 1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ
  • రూ.18 వేల కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ
  • వడ్డీ రూపంలోనే స్వామివారికి ఏటా రూ.1200 కోట్లు
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామి ఆదాయానికి కొదవలేదు. 2023-24 ఏడాదిలో తిరుమల తిరుపతి దేవస్థానం రూ.1,161 కోట్ల నగదుతో పాటు 1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసింది. ప్రస్తుతం స్వామి వారి పేరిట ఉన్న డిపాజిట్ల మొత్తం రూ.18 వేల కోట్లకు చేరుకుంది. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఏడుకొండలవాడికి వడ్డీ రూపంలో ఏటా రూ.1200 కోట్లు వస్తాయి. 2018 నాటికి స్వామివారి వార్షిక వడ్డీ రూ.750 కోట్లు ఉండగా, ఇప్పుడది మరో రూ.500 కోట్లు పెరిగి రూ. 1200 కోట్లకు చేరుకుంది.


More Telugu News