పంజాబ్ కింగ్స్ ను 142 పరుగులకు కుప్పకూల్చిన గుజరాత్ టైటాన్స్
- ముల్లన్ పూర్ లో పంజాబ్ కింగ్స్ × గుజరాత్ టైటాన్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్
- 4 వికెట్లతో పంజాబ్ ను దెబ్బతీసిన సాయి కిశోర్
గత కొన్నిరోజులుగా బ్యాట్స్ మన్ల ఆధిపత్యం కనిపిస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ లో ఇవాళ బౌలర్ల జోరు ఆవిష్కృతమైంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విజృంభించారు.
ముల్లన్ పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆ జట్టు 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కట్టారు.
కెప్టెన్ శామ్ కరన్ 20, ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 35, హర్ ప్రీత్ బ్రార్ 29 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. రిలీ రూసో (9), జితేశ్ శర్మ (13), లియామ్ లివింగ్ స్టన్ (6), శశాంక్ సింగ్ (8), అశుతోష్ శర్మ (3) విఫలమయ్యారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిశోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయడం మ్యాచ్ లో హైలైట్ గా నిలుస్తుంది. మోహిత్ శర్మ 2, నూర్ అహ్మద్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.