కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై సజ్జల స్పందన
- ఏపీలో మూడు పార్టీలు కలవడం శుభ పరిణామం అన్న చిరంజీవి
- కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపు
- కూటమికి చిరంజీవి మద్దతుపై తామేమీ ఆశ్చర్యపోవడం లేదన్న సజ్జల
- చిరంజీవే కాదు... ఇంకెవరు వచ్చినా తమకేమీ నష్టం లేదని స్పష్టీకరణ
ఏపీలో మూడు పార్టీల కలయిక శుభ పరిణామం అని, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపు ఇవ్వడం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదని అన్నారు. చిరంజీవే కాదు... ఇంకెవరైనా వచ్చి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం జరగని పని అని ఉద్ఘాటించారు.
ఏపీ ఎన్నికల ముఖచిత్రంలో ఇప్పుడొక స్పష్టత వచ్చిందని, ఇటువైపు సీఎం జగన్ ఒక్కరే ఉన్నారని, అటువైపు గుంటనక్కలు, తోడేళ్లు, ముళ్లపందులు ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.
ఇక, పవన్ కల్యాణ్ ఏమాత్రం పరిపక్వత లేని రాజకీయ నాయకుడు అని సజ్జల విమర్శించారు. పవన్ తీరు చూస్తుంటే చంద్రబాబు కోసమే పుట్టి, పెరిగినట్టున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడని, చంద్రబాబు బటన్ నొక్కితేనే కదులుతాడు, ఆగుతాడు అని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ చరిత్రకు చంద్రబాబే ముగింపు పలుకుతారని సజ్జల వ్యాఖ్యానించారు.