ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడు... ఆర్సీబీపై భారీ స్కోరు
- ఐపీఎల్ లో ఇవాళ కేకేఆర్ × ఆర్సీబీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు
- నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసిన కోల్ కతా
- రాణించిన ఫిల్ సాల్ట్, శ్రేయాస్ అయ్యర్
- ఆఖర్లో మెరుపుదాడి చేసిన రమణ్ దీప్ సింగ్
ఇవాళ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లోనే 48 పరుగులు చేయడం విశేషం. సాల్ట్ 7 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. వెంకటేశ్ అయ్యర్ 8 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు... కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు... రింకూ సింగ్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 24 పరుగులు చేశారు.
చివర్లో ఆండ్రీ రస్సెల్ 20 బంతుల్లో 4 ఫోర్లతో అజేయంగా 27 పరుగులు చేయగా... రమణ్ దీప్ సింగ్ చిచ్చరపిడుగులా చెలరేగాడు. రమణ్ దీప్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాళ్ 2, కామెరాన్ గ్రీన్ 2, మహ్మద్ సిరాజ్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.