ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ
- తొలి మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టు
- 3 ఓవర్లలో 27 పరుగులు చేసిన కోల్ కతా
ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్బీబీ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో కోల్ కతా మొదట బ్యాటింగ్ కు దిగింది.
ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ జోడీ 3 ఓవర్లలోనే 27 పరుగులు జోడించింది. ఫిల్ సాల్ట్ 20, నరైన్ 4 పరుగులతో ఆడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం బెంగళూరు టీమ్ లో మూడు మార్పులు జరిగాయి. సిరాజ్, కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కోల్ కతా టీమ్ లో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.
ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్క దాంట్లోనే గెలిచిన బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేనట్టే. ఇక ఆ జట్టు ప్రతి మ్యాచ్ గెలిస్తేనే, ఏ మూలో కొద్దిపాటి అవకాశాలు ఉంటాయి. అటు, కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.