హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత సహా నలుగురు అభ్యర్థులకు బీ ఫామ్‌లు నిలిపివేసిన బీజేపీ...?

హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత సహా నలుగురు అభ్యర్థులకు బీ ఫామ్‌లు నిలిపివేసిన బీజేపీ...?
  • హైదరాబాద్‌లో ప్రచారంలో దూసుకువెళుతున్న మాధవీలత
  • ఇప్పుడు హఠాత్తుగా బీ ఫామ్ నిలిపివేసిన బీజేపీ!
  • పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డిలకు నిలిపివేత
బీజేపీ నలుగురు అభ్యర్థులకు బీ-ఫామ్‌లు పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ, బూర నర్సయ్యగౌడ్ తదితరులు వివిధ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కానీ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులకు బీ ఫామ్ లు నిలిపివేసింది. ఇందులో హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి మాధవీలత కూడా ఉన్నారు.

హైదరాబాద్ నుంచి మాధవీలత తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమెకు బీ ఫామ్ నిలిపివేశారు. హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి నుంచి ప్రకటించిన గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డిలకు బీ ఫామ్‌ను నిలిపివేసింది. ఎందుకు పెండింగ్‌లో పెట్టింది అనేది తెలియాల్సి ఉంది.


More Telugu News