ఐపీఎల్: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... సన్ రైజర్స్ కు బ్యాటింగ్
- ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. భారీ స్కోర్లు సాధించడం అలవాటుగా మార్చుకున్న సన్ రైజర్స్ జట్టు నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ను వారి సొంతగడ్డపై ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలుస్తోంది.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్ లో ఎలాంటి మార్పులు లేవని, బౌలింగ్ విభాగంలో మార్పు ఉండొచ్చని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు.
ఇక, ఢిల్లీ జట్టులో ఫామ్ లో ఉన్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో ఆన్రిచ్ నోర్జే జట్టులోకి వచ్చాడు. టాస్ కు ఐదు నిమిషాల ముందు ఇషాంత్ వీపునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ తెలిపాడు.
టోర్నీలో ఇప్పటిదాకా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో ఆరోస్థానంలో ఉంది.