హత్యలు ఆపండి.. లేదంటే వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ తట్టుకోలేరు: సజ్జల
- టీడీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందన్న సజ్జల
- మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదని విమర్శ
- టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని వ్యాఖ్య
మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నేతలు వెనుకాడటం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు బైక్ తో ఢీకొట్టడం వల్లే వైసీపీ కార్యకర్త వెంకటరెడ్డి చనిపోయారని తెలిపారు. లోకేశ్ నామినేషన్ సమయంలో జరిగిన గొడవలో వెంకటరెడ్డి మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. మనుషుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదని అన్నారు.
తాము ఎంతో సంయమనాన్ని పాటిస్తున్నామని, నిగ్రహంతో ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా దాడులు, హత్యలు ఆపాలని... రెచ్చగొట్టడం మానాలని దండం పెట్టి అడుగుతున్నామని అన్నారు. లేకపోతే వైసీపీ నుంచి వచ్చే రియాక్షన్ ను తట్టుకోలేరని హెచ్చరించారు. దాడులు వాళ్లే చేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని చెప్పారు. వెంకటరెడ్డి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.