కేసీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది.. ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతున్నారు: కిషన్ రెడ్డి
- ఓటమిని కేసీఆర్, కేటీఆర్ ఇంకా అంగీకరించడం లేదన్న కిషన్ రెడ్డి
- లిక్కర్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయిందని విమర్శ
- బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడిందని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడిందని... ఆ పార్టీ పని అయిపోయినట్టేనని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గులాబీ పార్టీ ఓడిపోయి ఐదు నెలలు గడిచినా.. కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుందని... అభ్యర్థులను కూడా అందరి కంటే ముందే ప్రకటించామని చెప్పారు.
కవిత లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయిందని అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో కేసీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందని అన్నారు. జైశ్రీరామ్ నినాదం అన్నం పెడుతుందా? ఉద్యోగాలను ఇస్తుందా? అని కేటీఆర్ అంటున్నారని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.