వివిధ రంగాల ప్రభావవంతమైన వ్యక్తులతో నారా భువనేశ్వరి ముఖాముఖి
- కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
- చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో పూజలు
- ముస్లిం మహిళలతో కలిసి చంద్రబాబు జన్మదిన వేడుకలు
- కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. ఇవాళ చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పంలోని ముస్లిం మహిళలతో కలిసి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. అంతేకాదు, వివిధ రంగాలకు చెందిన ప్రభావశీలురైన వ్యక్తులతోనూ నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు.
డాక్టర్ మంజునాథ్:- మా కుటుంబం అంతా డాక్టర్లే. మేమంతా డాక్టర్లం అయ్యామంటే చంద్రబాబు మాకు ఇచ్చిన ప్రోత్సాహకాలే నిదర్శనం. కుప్పం నియోజకవర్గంలోని ఆసుపత్రుల్లో డాక్టర్లు సరిగా లేరు. డాక్టర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సహకరించాలి.
భువనేశ్వరి:- ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలంటే అక్కడ సమర్థవంతమైన నాయకుడు ఉండాలి. కుప్పం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు ప్రోత్సహిస్తే, వైసీపీ ప్రభుత్వం వారిని దెబ్బతీసింది. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 3 ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశాం, ప్రజలకు ఇంటింటికీ భోజనాలు అందించాం. కుప్పంలో ప్రజలకు డాక్టర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటాం.
శ్రీకాంత్ (న్యాయవాది):- వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చింది. ఇలాంటి చెత్త చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ చట్టం పేద, బడుగు, బలహీన వర్గాలకు చాలా నష్టం. ఈ చట్టం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
భువనేశ్వరి:- వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలకు కొలమానం లేదు. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు తమ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకున్నట్లే... ప్రతిరోజు రైతులు తమ భూములు ఉన్నాయో, లేదో చూసుకోవాలని నేను చెబుతున్నాను. తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసేందుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటారు.
పెన్షనర్స్ అసోసియేషన్:-నేను రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. టీడీపీ గొప్పతనాన్ని ఓటర్లకు వివరిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం పెన్షనర్లకు కోట్లాది రూపాయలు పెండింగ్ పెట్టింది. అవన్నీ విడుదల చేసేందుకు చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. కుప్పంలో పెన్షనర్ల అసోసియేషన్ కు ఓ భవనం నిర్మించాలి. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారు, ముఖ్యమంత్రి అవుతారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చేందుకు కుప్పం ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు.
భువనేశ్వరి:- వెనుకబడిన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు. సంపదను సృష్టించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తారు. పెన్షనర్లకు భవనం కట్టిస్తారు. పాత బకాయిలు విడుదల చేయిస్తారు.
గణేష్, ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగి:- దేశంలోనే అత్యంత విస్తీర్ణం కలిగిన యూనివర్శిటీ ద్రవిడ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో 9 నెలలుగా సరిగా వేతనాలు లేవు. యూనివర్సిటీ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ మేము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. వైసీపీ నాయకులు గత ఎన్నికల సమయంలో మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. యూనివర్సిటీకి భూములు ఇచ్చిన వారికి ఎలాంటి ఉపయోగం లేదు. మేము జీతాలు కోసం పోరాడుతున్నామని మాపై వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టించారు.
భువనేశ్వరి:- చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ద్రవిడ యూనివర్సిటీకి పూర్వవైభవాన్ని తీసుకొస్తారు. వైసీపీ నేతలు మీకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ప్రభావితం చేయాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చిత్తూరు జిల్లాలోని కాలేజీలు అన్నింటినీ ద్రవిడ యూనివర్సిటీ క్రిందకు తీసుకొచ్చి యూనివర్సిటీ అభివృద్ధికి అనేక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటారు. టెక్నికల్ విద్యా కోర్సులు, దూరవిద్యా కోర్సులను కూడా ద్రవిడ యూనివర్సిటీలో చంద్రబాబు తీసుకొస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి మూడు నెలల్లో ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తారు.
రాజేంద్రప్రసాద్ (ఎక్స్ సర్వీస్ మ్యాన్):- నేను 15 ఏళ్లు ఆర్మీలో పనిచేసి, తదనంతరం డైరెక్ట్ ఎస్.ఐగా సెలక్ట్ అయ్యాను. సీఐగా రిటైర్ అయ్యాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 250 మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకు సొంత స్థలాలు, ఇళ్లు ఇప్పించారు. మాకు ఇచ్చిన స్థలాలను వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు. ఈ ప్రాంతంలో మరో 100 మంది ఎక్స్ సర్వీస్ పర్సన్స్ కు స్థలాలు లేవు. వారికి కూడా స్థలాలు ఇప్పించాలి.
భువనేశ్వరి:- చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సమస్యలను పరిష్కరిస్తారు. స్థలాలు ఇప్పిస్తారు.
ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధి:- చాలా తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు నడుపుతున్నాం. సొంత స్థలాలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఒక్కో విద్యాసంస్థకు 2 ఎకరాల స్థలం ఇప్పించి ఆదుకోవాలి.
భువనేశ్వరి:- చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలను ఆదుకుంటారు. సమస్యలను పరిష్కరిస్తారు.
ప్రసాద్ (సామాజిక కార్యకర్త):- కుప్పం నుండి బెంగళూరుకు ఇక్కడి ప్రజలు వలస వెళ్లి పనులు చేసుకుని రావాలి. మహిళలను ఆదుకునేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
భువనేశ్వరి:- చంద్రబాబు మహిళలకు ప్రాధాన్యతనిచ్చి, వారి అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తారు. మహిళా శక్తిని ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది.
జనార్దన్, ఎల్.ఐ.సీ ఏజెంట్ల విభాగం:- గతంలో పలమనేరు వెళ్లి పాలసీలు కట్టాల్సివచ్చేది. చంద్రబాబు మా సమస్యలను తెలుసుకుని కుప్పంలో ఎస్.ఓ ఆఫీసును పెట్టి మాకు ప్రయాణ భారం తప్పించారు. ఎల్.ఐ.సీ ఏజెంట్లకు భద్రత కల్పించే పథకాలు ఇప్పించాలి. మాకు కుప్పంలో ఎల్.ఐ.సీ మెయిన్ బ్రాంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
భువనేశ్వరి:- చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎల్.ఐ.సీ మెయిన్ బ్రాంచ్ తెచ్చేందుకు కృషి చేస్తారు.
పాస్టర్ల అసోసియేషన్ ప్రతినిధి:- చంద్రబాబు పాలనలో మాకు క్రిస్టియన్ మైనారిటీ భవనానికి రూ.25 లక్షలు ఇచ్చారు. వైఎస్ఆర్, జగన్ ప్రభుత్వాలు మాకు ఎలాంటి సహకారాలు అందించలేదు. మాకు శ్మశాన వాటిక స్థలం సరిపోవడం లేదు. శ్మశానవాటికకు సరిపడా స్థలాన్ని ఇప్పించాలి. కుప్పం నియోజకవర్గంలోని క్రైస్తవుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి.
భువనేశ్వరి:- వైసీపీ పాలనలో శ్మశాన స్థలాలను కూడా వదలడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక క్రైస్తవులకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటారు. సమస్యలను పరిష్కరిస్తారు.
ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి:- 2014 నుండి ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సిబ్బందిగా పనిచేస్తున్నాం. మేం కేవలం రూ.10 వేలకే ఉద్యోగాలు చేస్తున్నాం. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. మాకు మంచి జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
భువనేశ్వరి:- చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అవర్ బేస్డ్ ఫ్యాకల్టీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.